
హైదరాబాద్: రాజ్ భవన్ పై అసత్య ఆరోపణలను ఖండించాలని గవర్నర్ కార్యాలయ సిబ్బంది రాష్ట్ర ప్రజలను కోరారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. రాజ్యాంగ కార్యాలయమై రాజ్ భవన్ ను రాజకీయాల్లోకి లాగి వివాదాలు సృష్టించడం కరెక్ట్ కాదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కొంతమంది నిరాధారమైన ఆరోపణలతో రాజ్ భవన్ కు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి ఆరోపణలను తిప్పికొట్టాలని రాజ్ భవన్ అధికారులు కోరారు. భవిష్యత్ లో రాజ్ భవన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్ట పరంగా చర్యలుంటాయని వారు హెచ్చరించారు.